ఐపీఎస్‌ ఆఫీసర్లతో ప్రధాని మోడి సంభాషణ

PM Modi interacts with IPS Probationers via Video Conferencing

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పేరేడ్‌ జరుగుతుంది. ఈనేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. ఢిల్లీలో పాసౌట్ అయిన‌ యువ ఐపీఎస్‌ల‌ను తాను రెగ్యుల‌ర్‌గా క‌లుస్తానని, కానీ క‌రోనా వ‌ల్ల ఈసారి మిమ్ముల్ని క‌ల‌వ‌లేక‌పోతున్న‌ట్లు చెప్పారు. అయితే త‌న ప‌ద‌వీ కాలంలో ఏదో ఒక‌సారి క‌చ్చితంగా మిమ్మ‌ల్ని క‌లుస్తాన‌న్నారు. వ‌త్తిడిలో ప‌నిచేసేవాళ్ల‌కు యోగా, ప్రాణాయామం బాగా ఉపయోగ‌ప‌డుతుంద‌న్నారు. మీరు మీ గుండె నుంచి ఏ ప‌ని చేసినా.. దాని వ‌ల్ల మీరు ల‌బ్ధి పొందుతార‌న్నారు. ఎంత ప‌ని ఉన్నా.. మీరు వ‌త్తిడికి లోనుకార‌ని ప్ర‌ధాని త‌న సందేశంలో తెలిపారు. ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి తప్ప అహంభావం ఉండకూడదని ప్రధాని మోడి అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/