మినీ ఇండియాను చూసినట్లు ఉంది: మోడి

గణతంత్ర రిహార్సల్స్‌కి ప్రధాని మోడి


PM Modi interacted with cadets & artists who will be performing at the Republic Day in Delhi

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవానికి దేశవ్యాప్తంగా ఉండే వేర్వేరు రాష్ట్రాల కళాకారులు ఢిల్లీ వచ్చి పరేడ్‌లో ప్రదర్శనలు ఇస్తారు. ఈసారి కూడా వాళ్లంతా ఆదివారం జరిగే 71వ రిపబ్లిక్ డేలో ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ముందుగా చేసే రిహార్సల్స్‌‌కి ప్రధాని మోడి హాజరయ్యారు. కళాకారులు, విదిది కాడెట్ల పెర్ఫార్మెన్స్‌ను కళ్లారా చూశారు. ఈ ఎట్ హోం కార్యక్రమంలో… ప్రధానితోపాటూ… గిరిజన అతిథులు కూడా పాల్గొన్నారు. ఈ కళాకారుల రిహార్సల్స్ ప్రదర్శనలను మోడితోపాటూ… చాలా మంది ప్రజలు చూశారు. ఇదంతా చూస్తుంటే… మినీ ఇండియాని చూసినట్లు ఉందని ప్రధాని మోడి అన్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో భారత దేశ సారాన్ని మీరు ప్రతిబింబిస్తారు అని మోడి వాళ్లను మెచ్చుకున్నారు. ఇండియా అంటే భౌగోళికంగా ఓ ప్రాంతం, ఓ జనాభా మాత్రమే కాదన్న మోడి… ఇండియా అంటే సర్వ కళలు, సంప్రదాయాలు, ఆచారాల మేళవింపు అంటూ కళాకారుల్ని మెచ్చుకున్నారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/election-news/telangana-election-news/