రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో ప్రధాని మోడీ

కోర్టుల్లో స్థానిక భాష‌ల‌కు ప్రాధాన్య‌మివ్వాలి.. ప్రదాన మోడీ పిలుపు

PM Modi inaugurates the Joint Conference of CM of the States & Chief Justices of High Courts | PMO

న్యూఢిల్లీ: నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో స‌మావేశం ఢిల్లీలో ప్రారంభ‌మైంది. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు ప్రారంభించిన ఈ స‌మావేశంలో ప్ర‌దాని మోడీ కీల‌క ప్ర‌సంగం చేశారు. కోర్టుల్లో స్థానిక భాష‌కే ప్రాధాన్య‌మివ్వాల‌ని మోడీ పిలుపునిచ్చారు.

డిజిట‌ల్ ఇండియా ప్ర‌గ‌తిలో అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల సీజేలు త‌మ‌తో క‌లిసి రావాల‌ని ప్ర‌ధాని మోడీ కోరారు. న్యాయ శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకుంటున్నామని ఆయ‌న చెప్పారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో న్యాయ వ్య‌వ‌స్థ‌ది పాత్ర కీల‌క‌మ‌ని మోడీ పేర్కొన్నారు. దేశంలో డిజిట‌ల్ లావాదేవీలు అసంభ‌వ‌మ‌ని కొంద‌రు అన్నార‌న్న మోడీ … నేడు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక డిజిట‌ల్ లావాదేవీలు జ‌రుగుతున్న దేశంగా భారత్ నిలిచింద‌ని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/