ప్ర‌ధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని

YouTube video
PM Modi inaugurates Pradhanmantri Sangrahalaya in New Delhi

న్యూఢిల్లీ : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేడు ఢిల్లీలో కొత్త‌గా ఏర్పాటు చేసిన భార‌త ప్ర‌ధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రారంభించారు. ప్ర‌ధాని మోడీ మొద‌టి టిక్కెట్ కొని, ఈ మ్యూజియాన్ని సంద‌ర్శించారు. ఈ మ్యూజియంలో 14 మంది ప్ర‌ధానుల చ‌రిత్ర వుంటుంది. వాళ్లు దేశాన్ని ఎలా న‌డిపారు? లాంటి విషయాలు కూడా ఇందులో వుంటాయి. ఇక భార‌త మొద‌టి ప్ర‌శాని నెహ్రూ జీవితం, ఆయ‌న దేశానికి చేసిన సేవ‌ల‌కు సంబంధించి ఓ డిస్‌ప్లేను కూడా వుంచారు. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా నెహ్రూకు వ‌చ్చిన బ‌హుమ‌తుల‌ను కూడా ఈ మ్యూజియంలో వుంచారు. దేశ ప్ర‌ధానులు ,వారి జీవితాలు, దేశం కోసం వారు ప‌డ్డ శ్ర‌మ‌… ఇలా మొత్తం కూడా ఇందులో పొందుప‌రిచారు.

కాగా, భారత దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు ఈ మ్యూజియాన్నిమోడీ అంకితం చేశారు. ప్రధాని మోడీ గతంలో వివిధ నగరాల్లో మెట్రో రైడింగ్‌లో టిక్కెట్లు కొనుగోలు చేశారు. మోడీ ఎప్పుడూ డిజిటల్ చెల్లింపులు చేసేవారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/