కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని

YouTube video
PM Modi inaugurates National Emblem atop new Parliament Building

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం పైఅంతస్థుపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. కాంస్యంతో రూపొందించిన ఈ చిహ్నం మొత్తం బరువు 9,500 కేజీలు కాగా, పొడవు ఆరున్నర మీటర్లు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్ నారాయణ్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, హర్దీప్‌ సింగ్ పురి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు భవన నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులతో ప్రధాని సంభాషించారు. కాగా ,2020 డిసెంబర్​ 10న ప్రధాని మోడీ పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/