అస్సాంలో అనేక వనరులు ఉన్నాయి..ప్రధాని

అస్సాంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Modi inaugurates, lays foundation stone of various development projects in Assam

ధెమాజీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు అస్సాం రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ధెమాజిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. రాష్ట్ర మౌళిక‌స‌దుపాయాల్ని అభివృద్ధి ప‌రిచేందుకు స్థానిక ప్ర‌భుత్వంతో క‌లిసి కేంద్రం ప‌నిచేస్తోంద‌న్నారు. అస్సాంలో అనేక వ‌న‌రులు ఉన్నాయ‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వాలు స‌వ‌తిలా చూశాయ‌ని, దాంతో అభివృద్ధి కుంటుప‌డింద‌న్నారు. ధెమాజిలోని సిలాప‌త్త‌ర్‌లో ప్ర‌ధాని మోడి ప‌లు ప్రాజెక్టుల‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్న టీ, టూరిజం, చేన‌త‌, హ్యాండీక్రాఫ్ట్ రంగాలు ఈ రాష్ట్రాన్ని స్వ‌యం స‌మృద్ధిగా మారుస్తున్నాయ‌న్నారు.

స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాశ్ నినాదంతో సీఎం శ‌ర‌బానంద సోనావాల్ ప‌నిచేశార‌ని కితాబిచ్చారు. బోగీబీల్ బ్రిడ్జ్‌ను పూర్తి చేశామ‌ని, బ్ర‌హ్మ‌పుత్ర‌పై నిర్మించిన క‌లియ‌బొమెర బ్రిడ్జ్ నిర్మాణంతో అస్సాంలో క‌నెక్టివిటీ పెరిగింద‌ని ప్ర‌ధాని అన్నారు. రాష్ట్రంలో ఫోర్‌లేన్ ర‌హ‌దారి ప‌నులు కూడా పురోగ‌తిలో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అస్సామీ ప్ర‌జ‌ల‌కు కావాల్సిన‌వ‌న్నీ అస్సాంలో ఉన్నాయ‌ని, కేవ‌లం డ‌బుల్ ఇంజిన్ ప్ర‌గ‌తి కావాల‌న్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని రెట్టింపు చేస్తాన‌ని హామీ ఇస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోడి తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/