అరుణాచ‌ల్‌లో డోనీ పోలో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన ప్రధాని

YouTube video

న్యూఢిల్లీః ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కు 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు.ఈశాన్య రాష్ట్రాల్లో ఈ విమానాశ్ర‌యంతో టూరిజంను అభివృద్ధి చేయ‌నున్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు 645 కోట్ల ఖ‌ర్చుతో డోనీ పోలో విమానాశ్ర‌యాన్ని నిర్మించింది. గంట‌కు 200 ప్ర‌యాణికుల్ని హ్యాండిల్ చేయ‌గ‌ల‌దు. మొత్తం ఎనిమిది చెక్ ఇన్ కౌంట‌ర్లు నిర్మించారు. 2300 మీట‌ర్ల ర‌న్‌వే ఉంది. బోయింగ్ 747 విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుకూలంగా విమానాశ్ర‌యాన్ని నిర్మించారు. డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌తో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మొత్తం మూడు విమానాశ్ర‌యాలు అందుబాటులోకి వ‌చ్చేస్తాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో విమానాశ్ర‌యాల సంఖ్య 16కు చేరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/