పంట పండించేవాళ్లే దేశ ప్రజాస్వామ్యానికి వెన్నుముక

YouTube video
PM Modi inaugurates Chauri Chaura Centenary Celebrations at Gorakhpur, Uttar Pradesh

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి యూపీలోని చౌరీ చౌరా శ‌తాబ్ధి వేడుక‌ల‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాతూ.. దేశ ప్ర‌గ‌తిలో రైతుల భాగ‌స్వామ్యం ఎప్పుడూ ఉన్న‌ద‌ని, చౌరీ చౌరా ఉద్య‌మంలోనూ వారి పాత్ర కీల‌కంగా ఉంద‌ని, గ‌త ఆరేళ్ల నుంచి రైతుల కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని, రైతుల‌ను స్వ‌యం స‌మృద్ధి చేసేదిశ‌గా అడుగులు వేశామ‌ని, దీని వ‌ల్లే క‌రోనా మ‌హమ్మారి వేళ కూడా వ్య‌వ‌సాయం రంగం వృద్ధి చెందిన‌ట్లు మోడి తెలిపారు. రైతుల పురోగ‌తి కోసం ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను మోడి వివ‌రించారు. రైతుల ప్ర‌యోజ‌నాల కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని, మండీల ద్వారా రైతులు ల‌బ్ధి పొందేందుకు.. మ‌రో వెయ్యి మండీల‌ను ఈనామ్‌కు లింకు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. క‌రోనా సంక్షోభ వేళ కూడా భార‌త్ రికార్డు స్థాయిలో పంట‌ను ఉత్ప‌త్తి చేసిన‌ట్లు ప్ర‌ధాని మోడి వెల్ల‌డించారు. పంట పండించేవాళ్లే దేశ ప్ర‌జాస్వామ్యానికి వెన్నుముక అని ఆయ‌న అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/