బుందేల్‌ఖండ్‌లో 296 కిలోమీట‌ర్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్ర‌ధాని

YouTube video

జ‌లౌన్‌: ప్ర‌ధాని మోడి నేడు యూపీలోని బుందేల్‌ఖండ్‌లో సుమారు 296 కిలోమీట‌ర్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. యూపీలోని ఏడు జిల్లాల మీదుగా ఈ ర‌హ‌దారి వెళ్తుంది. సుమారు 14,850 కోట్ల ఖ‌ర్చుతో దీన్ని నిర్మించారు. జ‌లౌన్ జిల్లాలోని కైథేరి గ్రామంలో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఫిబ్ర‌వ‌రి 29, 2020లో ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేశారు. కేవ‌లం 28 నెల‌ల్లోనే ఈ హైవేను నిర్మించారు. చిత్ర‌కూట్ జిల్లాలోని గోండా గ్రామం వ‌ద్ద ఎన్‌హెచ్‌-35తో ఈ హైవే క‌లుస్తుంది. ఆ త‌ర్వాత ఇటావా జిల్లాలోని కుద్రాలి గ్రామం వ‌ర‌కు ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. అక్క‌డ ఆగ్ర‌-ల‌క్నో ఎక్స్‌ప్రెస్‌వేతో క‌లుస్తుంది. తొలుత దీన్ని ఫోర్‌లేన్ రూట్‌గా నిర్మించారు. త‌ర్వాత సిక్స్ లేన్స్‌గా మార్చే అవ‌కాశం ఉంది. చిత్ర‌కూట్‌, బాండా, మ‌హోబా, హ‌మిర్‌పూర్‌, జ‌లౌన్‌, ఔర‌యా, ఇటావా జిల్లాల మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే వెళ్తుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/