నేడు ప్రధాని ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

PM Narendra Modi
PM Narendra Modi

న్యూఢిల్లీ: భారత్-‌చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులుపై ప్రధాని మోడి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రధాని నిర్వహించే వర్చువల్ కాన్ఫరెన్స్‌కు దేశంలోని వివిధ పార్టీల అధ్యక్షులు హాజరవుతారు. ఇండో చైనా సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ఈ మేరకు పీఎంవో ఓ ట్వీట్ చేసింది. అఖిలపక్ష భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/