రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోడి శుభాకాంక్షలు

Putin with Modi

న్యూఢిల్లీ: రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్రమోడి ట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త్‌ర‌ష్యా దేశాల మ‌ధ్య సంబంధాలను బ‌లోపేతం చేయ‌డంలో పుతిన్ కృషిని ప్ర‌ధాని కొనియాడారు. నా మిత్రుడు పుతిన్‌తో నేను ఫోన్‌లో మాట్లాడాను. ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాను. భార‌త్‌ర‌ష్యా దేశాల మ‌ధ్య ప్ర‌త్యేకమైన‌, విశేషాధికారాలు క‌లిగిన వ్యూహాత్మ‌క భాగస్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డంలో పుతిన్ అపార‌మైన శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచారు. అందుకు ఆయ‌న‌ను ప్ర‌శంసించాను అని ప్ర‌ధాని ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/