బిఎస్‌ఎఫ్‌ సిబ్బందికి ప్రధాని శుభాకాంక్షలు

Narendra Modi
Narendra Modi

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడి భారత సరిహద్దు భద్రతా దళాలకు శుభాకాంక్షలు చెప్పారు. బిఎస్‌ఎఫ్‌ 55వ రైజింగ్‌ డే సందర్భంగా బిఎస్‌ఎఫ్‌ మరియు వారి కుంటుంబాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపుతున్నానని ఆయన ట్విట్టర్‌ వేదికగా పోస్టు చేశారు. బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశానికి సేవలందిస్తున్నదని మోడి కొనియాడారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు, ప్రమాద తరుణాల్లో వారు అందించే సేవలు ఎన్నో రెట్లు గొప్పవని ఆయన అన్నారు. సరిహద్దు భద్రత కోసం ప్రతేక్యంగా 1965లో బిఎస్‌ఎఫ్‌ ఆవిర్భవించింది. కేంద్ర హోంశాఖ నియంత్రనలో పని చేస్తున్న బిఎస్‌ఎఫ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళంగా బిఎస్‌ఎఫ్‌ నిలిచింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/