జపాన్‌ కొత్త ప్రధానికి మోడి శుభాకాంక్షలు

PM Modi congratulates Yoshihide Suga

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడి జపాన్‌ నూతన ప్రధాని యొషిహిడే సుగాకు శుభాకాంక్షలు తెలిపారు. జ‌పాన్ నూత‌న ప్ర‌ధానిగా ఎన్నికైన యొషిహిడే సుగాకు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. సుగాతో క‌లిసి భార‌త్‌ జ‌పాన్ వ్యూహాత్మ‌క బంధాలు, అంత‌ర్జాతీయ సంబంధాల‌ను ఉన్న‌త శిఖరాల‌కు చేర్చాల‌ని తాను ఆశిస్తున్నాను అని అని ప్రధాని ట్వీట్‌ చేశారు. యొషిహిడే సుగా హ‌యాంలో అంత‌ర్జాతీయ సంబంధాలు కొత్త పుంత‌లు తొక్కుతాయ‌ని తాను భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని పేర్కొన్నారు. ఈ మేరకు నరేంద్రమోడి జపనీస్ భాషలో ట్వీట్ చేశారు. 

కాగా జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే అనారోగ్య కార‌ణాల‌తో గ‌త నెల త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామాను ఆమోదించిన జ‌పాన్ పార్ల‌మెంటు.. తాజాగా కొత్త ప్ర‌ధానిగా యొషిహిడే సుగాను బుధ‌వారం ఎంపిక చేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/