వచ్చే నెల 4న విశాఖ, భీమవరంలలో పర్యటించనున్న ప్రధాని

భీమవరంలో అల్లూరి 125 జయంత్యుత్సవాలకు హాజరుకానున్న ప్రధాని
సాయంత్రం 4 గంటలకు విశాఖలో మోడీ బహిరంగసభ

న్యూఢిల్లీ: వచ్చే నెల 4న విశాఖ, భీమవరంలలో ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలు భీమవరంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి మోడీ హాజరవుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖలో జరిగే బీజేపీ భారీ బహిరంగసభలో ఆయన పాల్గొని, ప్రసంగిస్తారు.

అల్లూరి సీతారామరాజు స్వస్థలం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని పాండ్రంగా గ్రామం. చింతపల్లి అడవుల్లో ఆయన పోరాటం చేశారు. బ్రిటిష్ వారి చేతుల్లో ఆయన మరణించింది కూడా విశాఖ ఏజెన్సీలోనే. కొయ్యూరు గ్రామంలో ఆయన చనిపోయారు. అల్లూరి జీవితం మొత్తం విశాఖ, విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంది. అందువల్ల అల్లూరి ఉత్సవాలు భీమవరంలో నిర్వహిస్తున్నప్పటికీ… విశాఖకు వస్తున్న మోడీ భీమవరం కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/