గోవా సీఎంగా ప్ర‌మోద్ సావంత్ ప్ర‌మాణ‌ స్వీకారం

PM Modi attends oath-taking ceremony of Goa CM Pramod Sawant at Panaji, Goa

ప‌నాజీ : ప్ర‌మోద్ సావంత్ గోవా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ పీఎస్ శ్రీధ‌ర‌న్ పిళ్లై.. ప్ర‌మోద్ సావంత్ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. గోవాలోని డాక్ట‌ర్ శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ స్టేడియంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, నాయ‌కులు హాజ‌ర‌య్యారు.

కాగా, కేబినెట్ మంత్రులుగా విశ్వ‌జిత్ రాణే, మౌవిన్ గోదిన్‌హో, రావి నాయ‌క్, నైలేష్ కాబ్ర‌ల్, సుభాష్ శిరోధ్క‌ర్, రోహ‌న్ కౌంటే, గోవింద్, గౌడే, అటాన్షియో మాన్‌సెరేట్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రెండోసారి సీఎంగా ప్ర‌మాణం చేసిన ప్ర‌మోద్ సావంత్‌కు గ‌వ‌ర్న‌ర్ శ్రీధ‌ర‌న్, ప్ర‌ధాని మోడీతో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/