గాంధీ 150వ జయంతికి బిజెపి ఎంపీల పాదయాత్ర

150 కి.మీ.ల పాదయాత్ర

Narendra Modi
Narendra Modi, PM

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బిజెపి పార్లమెంటు సభ్యులు ఒక్కొక్కరు 150 కి.మీ. పాదయాత్ర చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోది సూచించారు. ఈ మేరకు నేడు జరిగిన పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఎంపీలను కోరినట్లు ప్రహ్లాద్‌జోషి వెల్లడించారు. గాంధీ జయంతి అక్టోబరు 2నుంచి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ జయంతి ఐన అక్టోబరు 31 మధ్య ఒక్కో రోజు 15 కి.మీ.ల చొప్పున మొత్తం 150 కి.మీ.పూర్తి చేయాలని తెలిపారు. అలాగే రాజ్యసభ సభ్యులు బిజెపి బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టాలని కోరారు.
పాదయాత్ర సందర్భంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, ప్రకృతి వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని మోది ఆదేశించినట్లు జోషి తెలిపారు. మహాత్ముడి బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్ర కొనసాగుతుందన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/