ప్రధాని మోడి, ముఖ్యమంత్రులకు కరోనా టీకా!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి కరోనా టీకా వేయించుకోనున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు కూడా టీకా తీసుకోనున్నట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ప్ర‌ధాని మోడి.. రాజ‌కీయ‌వేత్త‌లతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండ‌వ రౌండ్‌లో టీకా తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు. తొలి ద‌శ‌లో కేవ‌లం ఫ్రంట్‌లైన్‌, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే టీకా వేస్తున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. బుధ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుమారు 7.86 ల‌క్ష‌ల హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు టీకాలు వేసుకున్న‌ట్లు కేంద్రం పేర్కొన్న‌ది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/