మరికాసేపట్లో ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష భేటి

సమావేశంలో పాల్గొననున్న 20 పార్టీల నేతలు

pm modi

న్యూఢిల్లీ: భారత్‌, చైనా సరిహద్దుల్లో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 20 పార్టీలకు చెందిన నేతలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు. ప్రధాని మోడి తరఫున రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యక్తిగతంగా వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు. సోనియా, మమత సహా పలువురు పార్టీల అధ్యక్షులతో మోడి చర్చించనున్నారు. వర్చువల్ సమావేశంలో నేతలు పాల్గొననున్నారు. అయితే ఈ సమావేశానికి ఆప్‌కు ఆహ్వానం అందలేదు. కాగా మరికాసేపట్లో మోడి నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/