ఆర్థిక సేవల రంగంలో బడ్జెట్‌ అమలుపై వెబ్‌నార్‌ను ఉద్దేశించి ప్రసంగం

YouTube video
PM Modi addresses webinar on implementation of Budget in financial services sector

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఆర్థిక సేవల రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు, నిబంధనల అమలుకు సంబంధించి శుక్రవారం ఓ వెబినార్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి డిపాజిటర్‌, ఇన్వెస్టర్‌కు నమ్మకం, పారదర్శకతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌, బ్యాంకిగేతర రంగాల్లో పాత పద్ధతులకు స్వస్తి పలుకుతామని చెప్పారు. దేశ బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రైవేట్‌ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ దిశగా బడ్జెట్‌లో పలు చర్యలను పొందుపరిచామని గుర్తుచేశారు.


దూకుడుగా రుణాలిచ్చే పేరుతో పది పన్నెండేండ్ల కిందట దేశంలో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పతనమైన పరపతి వ్యవస్ధను చక్కదిద్ది పారదర్శకతను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. గతంలో మాదిరి రాని బాకీలను కార్పెట్‌ కింద దాచేందుకు బదులు ఒక్కరోజు బకాయి పడిన బాకీలను వెల్లడించడం తప్పనిసరి చేశామని అన్నారు. అయితే వ్యాపారంలో ఒడిదుడుకులను ప్రభుత్వం అర్ధం చేసుకుంటుందని, ప్రతి వ్యాపార నిర్ణయానికి దురుద్దేశాన్ని ఆపాదించరాదని గుర్తెరిగిందని పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/