జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ప్రధాని మోడి బహిరంగ సభ


PM Modi addresses public meeting at Dhanbad, Jharkhand

ధన్‌బాద్‌: జార్ఖండ్ లోని ధన్ బాద్ లో బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంలో తాము ఎన్నికల ముందు చెప్పిందే ఇప్పుడు చేశామని ఆయన అన్నారు. ‘ఎన్నో ఏళ్లుగా ఉన్న అయోధ్య సమస్యను శాంతియుతంగా పరిష్కరిస్తామని మేము హామీ ఇచ్చాము. అయోధ్య సమస్య పరిష్కారం అంశాన్ని కాంగ్రెస్ మాత్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ వచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇప్పుడు మార్గం సుగమమైంది’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజలందరికీ
బిజెపి పై నమ్మకం ఉందని, తాము ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని మోడి అన్నారు. ‘పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలకు ఆజ్యం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ చర్యలతో ప్రజలు తప్పుదోవ పట్టొద్దు. దీనివల్ల అసోంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాషకు ఎటువంటి నష్టం జరగబోదని నేను హామీ ఇస్తున్నాను’ అని మోడి వ్యాఖ్యానించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/