5 రాష్ట్రాల్లోనూ ఎదురుగాలి?

PM Modi
PM Modi

5 రాష్ట్రాల్లోనూ ఎదురుగాలి?

2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికార బిజెపికి ఎదురుగాలి వీస్తున్నట్లు కన్పిస్తోంది. ఐదు ప్రధాన ఛానెళ్లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కమలనాధులకు మింగుడు పడడం లేదు. మరోవైపు హస్తం పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారం చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది. 2019లో భారత తశదిశను నిర్ణయించే లోక్‌ సభ ఎన్నికలకు సన్నాహం అన్నట్లుగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడమే కాకుండా వివిధ సంస్థలు, ఛానెళ్లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు, మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీగా ఉన్న బిజెపికి మింగుడు పడని విధంగా ఉన్నాయి.

ఐదు జాతీయ ఛానెళ్లు వివిధ సంస్థలతో కలిసి నిర్వహించిన సర్వేల్లో ఫలితాలు కమలనాధులకు ప్రతికూలంగా, హస్తం పార్టీ కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛతీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బిజోపి ప్రభుత్వాలకు కాలం తీరినట్లే అన్పిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆయాచిత వరంగా మారింది. హిందూ ఓటర్లు అధికంగా ఉన్న మధ్యప్రదేశ్‌లో గత 15 ఏళ్లుగా బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అంతేకాకుండా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గత 13 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండటం బిజెపి పాలిట గుదిబండలుగా మారాయి. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌కు మంచి పేరున్నా ప్రభుత్వ వ్యతిరేకతే అధికారానికి దూరం చేసేలా కనిపిస్తోంది. మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాధ్‌, దిగ్విజ§్‌ుసింగ్‌ల త్రయం నేతృత్వంలో కాంగ్రెస్‌ వినూత్న స్థాయిలో దూకుడుగా ్పచారం నిర్వహించడం ద్వారా ఓటర్లకు చేరువయ్యింది.

మధ్యప్రదేశ్‌ శాసనభలోని 230 స్థానాలకు పోలింగ్‌ జరిగితే 116 స్థానాలు సాధించిన పార్టీకే అధికారం దక్కనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా రావడం కమలనాధుల కంటిమీద కునుకు లేకుండా చేసింది. అంతేకాదు హిందూ ఓటర్లు అధికంగా ఉన్న మరో బిజెపి రాష్ట్రం రాజస్థాన్‌లో సైతం కాంగ్రెస్‌ గాలి వీస్తున్నట్లుగా ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పకనే చెప్పాయి. వసుంధర రాజే సింధియా అధికారాన్ని చేజార్చుకోవడం ఖాయమని ఎన్నికలకు ముందు నిర్వహించిన పలు రకాల సర్వేలు సైతం తేల్చిచెప్పాయి. మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, యువనేత సచిన్‌ పైలట్ల కలిసి కట్టుగా చేసిన ప్రచారం రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడం తధ్యమని ఎగ్జిట్‌ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఇక బిజెపి విజయాల అడ్డా ఛత్తీస్‌గఢ్‌లో సైతం పరిస్థితి తారుమరయ్యేలా కనిపిస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇటు బిజెపికి అటు కాంగ్రెస్‌కు సమానంగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో 90 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. అధికారం సాధించాలంటే 46 స్థానాలు సాధిస్తే చాలు. అయితే 46 సీట్ల మ్యాజిక్‌ ఫిగర్‌ ఇటు అధికార బిజెపిని, అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఊరిస్తోంది. మరోవైపు గత 15 ఏళ్లుగా ప్రతిపక్షాల అనైక్యత, ఓట్ల చీలికతో పాటు సమర్థవంతమైన పాలనతో నెగ్గుకు వచ్చిన ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తొలిసారిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చవిచూడాల్సి వచ్చింది.

కాగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో ప్రాంతీయ పార్టీదే హవా అని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెబుతున్నాయి. అక్కడ ప్రాంతీయ పార్టీలతో కలసి అధికారంలోకి రావాలన్న కమలనాధుల కలలు కల్లలవుతాయని సర్వేలంటున్నాయి. అధికార కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమని మిజో నేషనల్‌ ఫ్రంటే అక్కడ కీలకం కాబోతోందని సర్వేల సారాంశం. మిజోరంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌ పుట్టి ముంచింది. ఇక్కడ మిజో నేషనల్‌ ఫ్రంట్‌ కీలకమైన స్థానాలను గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. బ్రూ తెగ ఓటర్ల ఆందోళనలు, స్థానిక సమస్యలు, అక్కడి ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న భావన మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు మెరుగైన స్థానాలు కట్టబెడుతున్నాయన్నవి ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల సారాంశం.

మొత్తం 40 సీట్లున్న మిజోరంలో ఎంఎన్‌ఎఫ్‌ 16 నుండి 22 సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు 8 నుండి 12 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే చెబుతోంది. ఇక్కడ మరో ప్రాంతీయ పార్టీ జెడ్‌ పీఎం 8 నుండి 12 సీట్లకు గెలుచుకుంటుందన్నది ఆ సంస్ద లెక్కలు వెల్లడిస్తున్నాయి. రిపబ్లిక్‌ టివి కూడా 16 నుండి 22 సీట్లు మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు వస్తాయని ఊహిస్తోంది. కాంగ్రెస్‌కు 14 నుండి 18 సీట్లు జెడ్‌ పీఎం కు 10 స్థానాలు, ఇతరులకు మూడు స్థానాలు వస్తాయని రిపబ్లిక్‌ టివి సర్వే అంచనా. నూస్‌ ఎక్స్‌ సర్వే ఎంఎన్‌ఎఫ్‌కు 19 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌ఖు 15 సీట్లు వస్తాయని, ఇతరులు ఆరు స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో బిజెపి అధికారం సంపాదించిన విధంగానే మిజోరంలోనూ గెలుస్తామన్న కమల ఆధుల ఆశలు ఆవిరైపోయాయి.

కనీసం ఒక్క సీటు కూడా గెలుస్తాయన్న అంచనా ఏ సర్వేలు ఇవ్వకపోవడం విశేషం. ఇక రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేతను ఎదుర్కొంటున్న వసుంధర రాజేకు తాజాగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు పూర్తిగా నిరాశ పరిచాయి. ఇప్పుడు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు నిజమే అయితే రాజకీయంగా ఆమె కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే. 1019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ టీమ్‌, వసుంధర టీమ్‌ను పక్కనపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు అదే విషయాన్ని తెలియచేస్తున్నాయి. వసుంధరా రాజే ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉందని ఎగ్జిట్‌ పోల్‌ పలితాలు చెబుతున్నాయి.

టైమ్న్‌ నౌ సర్వే ప్రకారం 200 సీట్లు ఉన్న రాజస్థాన్‌ అసెంబ్లీలో ఎన్నికలు జరిగినవి 199 స్థానాలు. వీటిలో బిజెపికి 85, కాంగ్రెస్‌కు 105, బిఎస్పీకి 2, ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇండియా టుడే టీమ్‌ రాజస్థాన్‌ అంతా విస్తృతంగా పర్యటించి 63 వేల మంది ఓటర్లను సర్వే చేసింది. ఈ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే కాంగ్రెస్‌కు ఏకంగా 119 నుండి 141 స్థానాలు వస్తాయని, ఇతరులకు 4 నుండి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ఇండియా టివి సర్వే కూడా కాంగ్రెస్‌కు 100 నుండి 110 సీట్లు వస్తాయని లెక్కకట్టింది. బిజెపికి 80 నుండి 90 సీట్లు వస్తాయని, బిఎస్పీ మూడు స్థానాలు గెలుకునే ఆస్కారం ఉందని, ఇతరులు ఆరునుండి 8 సీట్లు గెలుస్తారని అంచనా. వేస్తోంది. ఇక రిపబ్లిక్‌ టివి ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం బిజెపికి 76 సీట్లు, కాంగ్రెస్‌కు 115 సీట్లు, ఇతరులకు 8 సీట్లు వస్తాయని తేలింది.

ఇక ఏబీపీ ఛానెల్‌ రాజస్థాన్‌లో ప్రాంతాల వారీగా సర్వే చేసి ఫలితాలు వెల్లడించింది. ఏబీపీ సర్వే ప్రకారం 39 సీట్లు ఉన్న ఉత్తర రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఓట్‌ షేర్‌ 39 శాతంగా ఉంటుందని, బిజపి ఓట్‌ షేర్‌ 32 శాతం, ఇతరుల ఓట్‌ షేర్‌ 29 శాతంగా ఉండచ్చని తేల్చింది. ఇక పశ్చిమ రాజస్థాన్‌ విషయానికి వస్తే బిజెపికి ఓట్‌ షేర్‌ 45 శాతం ఉంటుందని, కాంగ్రెస్‌కు ఇక్కడ 39.5 శాతం ఉండొచ్చని, ఇతరులకు 15 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. అలాగే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది. అధికారం కోసం బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. రెండు పార్టీల మధ్య సీట్లు, ఓట్లు తేడా అతి తక్కువగా ఉంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టంచే స్తున్నాయి.

వివిధ సర్వేలను పరిశీలిస్తే టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం బిజెపి 126 సాథనాలు, కాంగ్రెస్‌ ప్లస్‌ 89, బిఎస్పీ 6, ఇతరులు 9 సీట్లు దక్కించుకుంటారని అంచనా వేసింది. అదే ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ ప్రకారం కాంగ్రెస్‌ 104 నుండి 122 వరకూ, బిజెపి 102 నుండి 120 వరకూ. బిఎస్పీకి ఒకటి నుండి మూడు వరకూ, ఇతరులు 3 నుండి 8 వరకూ సీట్లను గెలుచుకుంటాయని తెలిపింది.

సి ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌ విషయంలో బిజెపి 90 నుండి 106 స్థానాలు, కాంగ్రెస్‌ 110 నుండి 126 స్థానాలు, ఇతరులు 6 నుండి 22 మంది, బిజెస్పీకి ప్లస్‌ 7 సీట్లు వస్తాయని తెలిపింది. జంకీ బాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలో బిజెపి 12 8 నుండి 129 స్థానాలు, కాంగ్రెస్‌కు 95 నుండి 115 వరకూ, ఇతరులకు 7 సీట్లు వస్తాయని పేర్కొంది.