ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని

PM launches PM Ayushman Bharat Health Infrastructure Mission & development projects in Varanasi

వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ మైలురాయిని దాటినందుకు భారత దేశాన్ని మోడీ అభినందించారు. కాశీ విశ్వనాథుడు, గంగమ్మ తల్లి, కాశీ ప్రజల ఆశీర్వాదాల వల్ల ‘అందరికీ టీకా, ఉచిత టీకా’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. దీపావళి, ఛాత్ తదితర పండుగలను దేశమంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/