లాక్‌డౌన్‌పై ప్రణాళికలు వేసుకోవాలి!

మన ఆర్థిక వ్యవస్థ బాగుందన్న ప్రధాని

pm modi video conference with chief ministers
pm modi video conference with chief ministers

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులతో ప్రధాని మోడి వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పొడింగించేందుకు కేంద్రం మొగ్గు చూపినట్లున్నట్లు తెలుస్తుంది.లాక్‌డౌన్ ఎత్తేసేందుకు ప్లాన్ రూపొందించాలని, అందుకోసం రెడ్, గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల విభజన చేసుకోవాలని మోడి ముఖ్యమంత్రులకు సూచించినట్లు సమాచారం. అయితే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడగింపు వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. కాగా భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో మే3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడగించాలని మోడికి సూచించినట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావం మున్ముందు కొన్ని నెలల పాటు ఉంటుందని, మాస్కులు, ఇతర కవచాలు మన నిత్యజీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. లాక్ డౌన్ అమలు సత్ఫలితాలను ఇచ్చిందని, తద్వారా ఒకటిన్నర నెలల కాలంలో వేలమంది ప్రాణాలు నిలిచాయని తెలిపారు. ‘మనదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చింతించాల్సిన అవసరం లేదు. మన ఆర్థిక వ్యవస్థ బాగుంది’ అని మోడి వ్యాఖ్యానించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/