సర్దార్ధమ్ భవన్‌ను ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM inaugurates Sardardham Bhavan, lays foundation stone of Sardardham Phase II Kanya Chhatralaya

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారంనాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్ధమ్ భవన్‌ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ.. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న అల్‌ఖైదా ఉగ్రవాదాలు జరిపిన దాడి అత్యంత విషాదకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత్ నేర్పిన మానవతా విలువలే శాశ్వత పరిష్కారమని అన్నారు. సెప్టెంబర్ 11వ తేదీకి మరో ప్రాధాన్యత కూడా ఉందని, చికాలోలో స్వామి వివేకానంద 1893లో ఇదే తేదీన ప్రసంగం చేశారని, భారతదేశ మానవతా విలువలను ప్రపంచ దేశాలకు స్వామి వివేకానందం తన ప్రసంగంలో చాటి చెప్పారని అన్నారు.

భారతదేశ సంస్కృతిని ఎంతో అద్భుతంగా విశ్వవేదికపై స్వామి వివేకానంద ఆవిష్కరించారి చెప్పారు. మానవత్వంపై దాడి జరిగిన రోజు, ప్రపంచానికి మానవతా విలువలు చాటిన రోజు అయిన సెప్టెంబర్ 11నే సర్దార్‌థామ్ భవన్ ప్రారంభం కావడం విశేషమని పేర్కొన్నారు. విద్య, సామాజిక మార్పు, బలహీన వర్గాలకు చేయూత, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సర్దార్‌థామ్ పని చేస్తుందని చెప్పారు. ఆర్థిక అసమానతలకు తావులేకుండా 2,000 మంది బాలికలకు కన్యా ఛాత్రాలయలో హాస్టల్ సౌకర్యం కల్పిస్తుందని ప్రధాని చెప్పారు. కోవిడ్ మహమ్మారిపై మాట్లాడుతూ, భారతదేశంతో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం పడిందని, అయితే భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ అంతకంటే వేగంగా కోలుకుందని ప్రధాని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/