భారత్‌ భూభాగాన్ని మోడి చైనాకు అప్పగించారు

ట్వీటర్ వేదికగా రాహుల్‌ ప్రశ్నలు..

భారత్‌ భూభాగాన్ని మోడి చైనాకు అప్పగించారు
rahul-gandhi

న్యూఢిల్లీ: లడఖ్ లో నెలకొన్న పరిస్థితులపై రాహుల్ గాంధీ ప్రధాని మోడిపై మరో సంచలన ఆరోపణ చేశారు. ప్రధాని మోడి భారత్ భూభాగాన్ని చైనా యద్ధోన్మాదానికి వదులుకున్నారంటూ మండిపడ్డారు. ఒకవేళ ఆ భూభాగం చైనాదే అయితే భారత్ సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని రాహుల్ గాంధీ ట్వీటర్ వేదికగా సూటి ప్రశ్నలు సంధించారు. అసలు సైనికులు ఏ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు చెప్పాలని కేంద్రాన్ని నిలదీసారు. భారత్ భూభాగంలోకి ఎవరూ చొచ్చుకురాలేదని, మన ప్రాంతాల్ని అక్రమించుకోలేదంటూ ప్రధాని అఖిల పక్ష సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ ఈ ప్రశ్నలను సంధించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/