దయచేసి మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి

బ్యాంకులను కోరిన విజయ్‌ మాల్యా

vijay mallya
vijay mallya

లండన్‌: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వేలకోట్ల రూపాయలు ఎగవేసి లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. అయితే మాల్యా డబ్బులు వెనక్కి తీసుకోవాలంటూ భారత్‌లోని బ్యాంకులకు మొరపెట్టుకున్నాడు. విచారణ కోసం నిన్న లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌కు హాజరైన మాల్యా అనంతరం మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన అసలులో వందకు వంద శాతాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను కోరాడు. ఈ విషయంలో చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నాడు. తీసుకున్న రుణాలను చెల్లించలేదని మాత్రమే బ్యాంకులు ఈడీకి ఫిర్యాదు చేశాయని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తానెటువంటి నేరాలకు పాల్పడలేదని స్పష్టం చేశాడు. అయితే, ఈడీ మాత్రం తన ఆస్తులను జప్తు చేసిందని మాల్యా ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే రకమైన ఆస్తుల కోసం ఓ వైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయని పేర్కొన్న మాల్యా.. బ్యాంకులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవాలని కోరాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/