నడిగర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును నిరాకరించిన హైకోర్టు

Madras High Court
Madras High Court

చెన్నై: నడిగర్‌ సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనుమతి నిరాకరిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 23న తేదీన నడిగర్‌ సంఘం ఎన్నికలు హైకోర్టు మాజీ న్యాయమూర్తి పద్మనాభన్‌ నేతృత్వంలో నిర్వహించాలనుకున్నారు. ఐతే కోర్టులో పలు కేసులు దాఖలవడంతో ఎన్నికలకు మాత్రమే కోర్టు అనుమతించింది. విచారణ చేసిన తర్వాత మాత్రమే ఓట్ల లెక్కింపు తేదీని వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. కోర్టు తీర్పు ప్రకారం బ్యాలెట్‌ బాక్సులను బ్యాంక్‌ లాకర్‌లో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో ఓట్లు లెక్కింపుకు అనుమతించాలని విశాల్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడంతో ఓట్ల లెక్కింపు ఇప్పట్లో సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/