పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి

pawan kalyan
pawan kalyan

హైదరాబాద్‌: వన సంరక్షణే జన సంరక్షణాగా భావించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పవన్‌కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ వన మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి జనసేన నాయకుడు, జనసేన సైనికుడు మొక్కల నాటే కార్యక్రమంలో భాగం కావాలని పవన్‌ పిలుపునిచ్చారు. ప్రకృతిలో మమేకం ఎలా కావాలో వేదాలు, పురణాల్లో, కావ్యాల్లో చెప్పడం జరిగిందన్నారు. పవిత్రంగా భావించే కార్తీక మాసంలో పర్యావరణ పరిరక్షణకు సంకల్పించామని, ఇది ఏదో ఒక నెలకు పరిమితం కాకుండా నిత్యం నిరంతర కార్యక్రమంగా జనసేన చెపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కుడా అందరూ తీసుకొవాలని మొక్కుబడిగా చేయకూడదు అన్నారు. మొక్కలు పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యంగా ఉంటుందన్నారు. ప్రాణికోటికి జీవనధారం అయిన గాలిని కాపాడలంటే మొక్కలు నాటాలి అప్పుడే స్వచ్చమైన గాలి దొరకుతుందన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యను కలుస్తానని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/