దేశంలో ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు దేశంలో ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పోలీసులను అప్రమత్తం చేసింది. దేశంలోని పలు సంస్థలపై దాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు వేశారని నిఘా వర్గాలు సమాచారమందించాయి. ఢిల్లీలోని ఎన్ఐఎ కార్యాలయం, సిజివో కాంప్లెక్స్‌పై దాడి చేయాలని చూస్తున్నారన్నాయి. అలాగే ఆర్ఎస్ఎస్ ప్రధాని కార్యాలయంతో పాటు సంఘ్ అగ్రనేతలపై కూడా దాడులు జరపాలని ఉగ్రవాదులు చూస్తున్నారని వారు తెలిపారు. పోలీసు, పారామిలిటరీ శిక్షణా కేంద్రాలను లక్షం చేసుకుని దాడులు చేయలనుకుంటున్నాయని ఆయా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఉగ్రవాదులు ఈ దాడులలకు పాల్పడేందుకు ఇసద్ధమవుతున్నారని, ఇప్పటికే పివొకె ద్వారా చొరబాట్లు జరిగాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో దాడులు జరగొచ్చని అందిన సమాచారంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు.
్ఖతాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/andhra-pradesh/