రహదారిపై ల్యాండయిన విమానం

plane-landing-on-highway
plane-landing-on-highway

వాషింగ్టన్‌: అమెరికాలో టకోమా పట్టణంలో రద్దీగా ఉండే రహదారిపై విమానం దిగింది. సింగిల్‌ ప్రొపల్షన్‌ ఇంజిన్‌ కలిగిన కేఈర్‌2 విమానం ఇంధన విభాగంలో సమస్య ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని జాగ్రత్తగా పార్క్‌ల్యాండ్‌ రహదారిపై దించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానం రోడ్డుపై దిగడంతో వాహనదారులు అవాక్కయ్యారు. అనంతరం అక్కడికి చేరుకన్న అధికారులు విమానాన్ని విమానాశ్రయానికి తరలించారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/