రైల్వే మంత్రి పియూష్ గోయల్ కు మాతృవియోగం

తన తల్లి వృద్ధాప్య కారణాలతో మరణించిందన్న పియూష్ గోయల్

రైల్వే మంత్రి పియూష్ గోయల్ కు మాతృవియోగం
Railway Minister Piyush Goyal’s mother Chandrakanta Goyal dies

న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తల్లి చంద్రకాంత గోయల్ కన్నుమూశారు. ఆమె ముంబయిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పియూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన మాతృమూర్తి వృద్ధాప్య కారణాలతో మరణించినట్టు వెల్లడించారు. ఆమె తన యావత్ జీవితాన్ని ప్రజాసేవకు అంకితమిచ్చిందని తెలిపారు. కాగా అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ అనంతరం చంద్రకాంత గోయల్ ముంబయిలో కార్పొరేటర్ గా ప్రస్థానం ఆరంభించారు. ఆపై ముంబయిలోని మాతుంగ అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, చంద్రకాంత గోయల్ భర్త దివంగత వేద్ ప్రకాశ్ గోయల్ సుదీర్ఘకాలం బిజెపి జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు. ఆయన వాజ్ పేయి సర్కారులో షిప్పింగ్ మంత్రిగా పనిచేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/