పిరమాల్‌ గ్రూప్‌ చైర్మన్‌తో మంత్రి కెటిఆర్‌ సమావేశం

తెలంగాణలో భారీగా పెట్టుబడులకు ముందుకొచ్చిన పిరమాల్‌

Minister KTR with piramal group
Minister KTR with piramal group

హైదరాబాద్‌: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు పిరమాల్ గ్రూప్ ముందుకొచ్చింది. మంత్రి కెటిఆర్‌ దావోస్ పర్యటన సందర్భంగా పిరమాల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమాల్‌తో భేటీ అయ్యారు. రానున్న మూడు సంవత్సరాల్లో 500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి పిరమాల్ గ్రూప్ ముందుకొచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో ప్రత్యక్ష 600 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడితో అవకాశం ఏర్పడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/