లోకేష్ కు..శుభ కార్యానికి, పరామర్శకు అర్థం తెలియదంటూ ఎమ్మెల్యే పిన్నెలి ఫైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై వైస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఓ రేంజ్ లో మండిపడ్డారు. లోకేష్ కు శుభ కార్యానికి, పరామర్శకు అర్థం తెలిదని అన్నారు. పల్నాడులో పరామర్శ పేరుతో వచ్చి, నాలుగు దండలు వేసుకుని, నుదుట పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. లోకేష్ వీరుడు కాదు ఒక జోకర్. హతుడు జల్లయ్య గురించి నారా లోకేష్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. జ‌ల్ల‌య్య‌పై టీడీపీ హయాం (2014 నుంచి 2019)లో ఏకంగా 10 కేసులు పెట్టార‌ని పిన్నెల్లి ఆరోపించారు.

టీడీపీ హ‌యాంలో 10 కేసులు న‌మోదైన జ‌ల్ల‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి ఎలా వ‌చ్చారంటూ లోకేశ్‌ను పిన్నెల్లి ప్ర‌శ్నించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తారన్న పిన్నెల్లి… వీటిని ప్రోత్సహిస్తే టీడీపీకి మొన్నటి ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లకి ఈసారి 3 సీట్లు కూడా రావని హెచ్చ‌రించారు. త‌మ‌ బయోడేటాలోనే భయమన్నది లేదని లోకేశ్ అంటున్నార‌న్న పిన్నెల్లి.. అసలు మీ తండ్రీ కొడుకుల బతుకులకి ఒక బయోడేటా ఉందా? అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

పల్నాడు రాజకీయాలు తెలియకపోతే.. మీ తండ్రిని అడిగితే చెబుతారని సూచించారు. రాజకీయాలంటే, ఆఫ్‌ నిక్కర్లు వేసుకుని విదేశాల్లో స్విమ్మింగ్‌ఫూల్‌లో అమ్మాయిలతో తిరగడం అనుకున్నావా అని మండిపడ్డారు. నీ పక్కన కూర్చోబెట్టుకున్న బ్రహ్మారెడ్డి తల్లి 2019లో ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆమె సొంత మండలంలో 15 ఫ్యాక్షన్‌ మర్డర్స్‌ జరిగాయి. అలాంటి ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న వ్యక్తి బ్రహ్మారెడ్డిని.. పక్కన కూర్చోబెట్టుకుని ఫ్యాక్షన్ గురించి, హత్యా రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.