మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మాచర్లలో అతడిని అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ఏపీ హైకోర్టు లో పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై వాదనలు జరుగగా కోర్టు బెయిల్‌ పిటిషన్లను రద్దుచేసింది. కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు వెంటనే మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.