డేనైట్‌ టెస్టులో టీమిండియా ఘన విజయం

india vs bangladesh
india vs bangladesh

కోల్‌కతా: బాంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డైనైట్‌ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ 2-0తో చేజిక్కించుకున్న టీమిండియా సొంతగడ్డపై వరుసగా 12 టెస్టు సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈడెన్‌లో మొదలైన డే/నైట్‌ టెస్టులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ బంగ్లాదేశ్‌ జట్టు 30.0 ఓవర్లలోనే 106 పరుగులకి అలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 136: 194 బంతుల్లో శతకం బాదడంతో 347/9తో ఇన్నింగ్స్‌ని డిక్లేర్‌ చేసింది. దీంతో పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ జట్టు ఈ రోజు తొలి సెషన్‌లో 195 పరుగులకి కుప్పకూలిపోయింది. భారత్‌ బౌలర్లలో (రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) ఇషాంత్‌ శర్మ 9 వికెట్లు, ఉమేష్‌ యాదవ్‌ 8 వికెట్లు పడగొట్టగా ..మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/