కాల్వ‌లో ప‌డిన వాహ‌నం, ఏడుగురు గ‌ల్లంతు

vehicle falls into canal
vehicle falls into canal

ల‌క్నోః ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని ల‌క్నోః సమీపంలో విషాదం చోటుచేసుకుంది. 29 మందితో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి నగ్రమ్‌ వద్ద ఇందిరా కాల్వలో పడిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేప్టటారు.  కాల్వలో పడిపోయిన వాహనంలో ఉన్న 22 మందిని రక్షించారు. మరో ఏడుగురు చిన్నారులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ విపత్తు నిర్వహణా దళాలతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఎస్‌ఎస్‌పీకి సూచించారు. పోలీసులతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సైతం గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టాయి.  

తాజా యాత్ర వార్త‌ల‌ కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/specials/tours/