బ్యూటీల హంగామా

Actresss-Elly-Awards-Function-
Actresss-Elly-Awards-Function-

ముంబైలో రీసెంట్ గా ఎల్లీ బ్యూటీ అవార్డ్స్ 2019 ఈవెంట్ జరిగింది.  సాధారణమైన ఫంక్షన్ అంటేనే డిజైనర్ డ్రెస్సులలో హాజరై అందాలొలికించే భామలు ‘బ్యూటీ అవార్డ్స్’ అంటే ఊరుకుంటారా? సూపర్ హాట్ గా ఉండే డ్రెస్సులు ధరించి ఎల్లి అవార్డుల ఈవెంటుకు ఫుల్లుగా కళతీసుకొచ్చారు. ఈ ఈవెంటుకు చాలామందే హాజరయ్యారు కానీ ఎక్కువ ఫోకస్ మాత్రం కరీనా కపూర్ ఖాన్.. జాన్వి కపూర్.. అనుష్క శర్మపైనే పడిందని ముంబై మీడియాలో టాక్.  
కరీనా స్టైల్ గురించి తెలిసిందే.. మొదటి నుంచే ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది.  జీరో సైజ్ ను ఇండియాలో మొదలు పెట్టి సంచలనం సృష్టించిన భామ కరీనా.  వివాహమై బాబు పుట్టిన తర్వాత కూడా ఫ్యాషన్ విషయంలో తన సత్తా చాటుతూనే ఉంది.  ఈ అవార్డ్స్ ఈవెంటుకు రెడ్ కలర్ ఫుల్ స్లీవ్స్ టాప్..  పింక్ కలర్ థై స్లిట్ స్కర్ట్  ధరించి హొయలుపోయింది. గౌనుకు పాకెట్స్ ఉండడంతో స్టైల్ గా పాకెట్స్ లో చేతులు పెట్టుకుని అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది.  
జాన్వి విషయానికి వస్తే ఈ జెనరేషన్ బ్యూటీ కాబట్టి సీనియర్లకు గట్టిపోటీ ఇస్తూ మెటాలిక్ బ్రౌన్ కలర్ గౌన్ ధరించి జనాలను దడదడలాడించింది.  డీప్ యూ-నెక్(దాన్ని వీ నెక్ అంటే మనకు ఇంగ్లీష్ రాదని అనుకునే ప్రమాదం ఉంది).. థై స్లిట్ తో హాట్ నెస్ ను ఒలికించింది.   ఇక అనుష్క శర్మ వైట్ కలర్ షిఫాన్  గౌన్ లో దుమ్ములేపింది. కొంతభాగం గౌన్ పారదర్శకంగా ఉండడం.. థై స్లిట్ కూడా ఉండడంతో అనుష్క కూడా ఎల్లి అవార్డ్స్ ఈవెంట్ లో ఏసీ పాయింట్లు పెంచాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ ముగ్గురే కాదు..ఇంకా ఇతర బ్యూటీలు కూడా హాటు డ్రెస్సుల్లో హాజరై బ్యూటీ అవార్డులకు ఈవెంటుకు న్యాయం చేశారు .

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/