ముఖ్యమంత్రి పుట్టిన రోజున ఫోటో ఎగ్జిబిషన్‌

ప్రజాప్రతినిధులంతా మొక్కలు నాటాలి

talasani srinivas yadav
talasani srinivas yadav

హైదరాబాద్‌: ఈ నెల 17న ముఖ్యమంత్రి కెసిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రజాప్రతినిధులంతా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. శనివారం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, జలవిహార్‌లో మొక్కలు నాటుతామని, అనంతరం హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జలవిహార్‌లో ఫోటో అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సీఎం కెసిఆర్‌ బాల్యం నుంచి నేటి వరకు ఆయన సాధించిన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళారుపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కెసిఆర్‌ సాధించిన విజయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌తో పాటు పార్టీ పెద్దలు హాజరుకానున్నట్లు మంత్రి తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/