కోచ్‌ ఇంటర్వ్యూలో ఆరుగురు నుంచి ఒకరు ఔట్‌!

Phil Simmons
Phil Simmons

ముంబయి: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ పదవికి ఇంటర్వ్యూలు మొదలవ్వగా ఆఖరి నిమిషంలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు, కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ను ఇంటర్వ్యూ జాబితాలో నుంచి తొలగించినట్లు తాజా సమాచారం. మధ్యాహ్నం భోజన విరామ సమయానికి ముందుగా అతడిని తొలగించారని తెలుస్తోంది. అయితే అతడిని ఎందుకు తొలగించారనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి ఆఖరి అభ్యర్థిగా ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఈ ఐదుగురిని ఇంటర్వ్యూ చేశాక రాత్రి ఏడు గంటలకు టీమిండియా నూతన కోచ్‌ని ప్రకటించే అవకాశం ఉంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/