ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి మూవీ టాక్

నాగ శౌర్య – మాళవిక నాయర్ జంటగా అవసర శ్రీనివాస్ తెరకెక్కించిన మూవీ ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో శ్రీనివాస్ అవసరాల – నాగ శౌర్య కలయికలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఇటీవలే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి వారి అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..లేదా అనేది సినిమా టాక్ ద్వారా తెలుసుకుందాం.
సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు సినిమాపై నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. సినిమా స్లో గా ఉందని, కామెడీ సీన్లు సరిగా వర్క్ అవుట్ కాలేదని చెపుతున్నారు. సినిమా మొదలైన పది నిమిషాలకే దర్శకుడు ప్లాట్‌లోకి తీసుకెళ్లాడని, అంతేకాకుండా ఆ తొలి పదినిమిషాలు సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందట. అయితే అదే ఇంట్రెస్ట్‌ను దర్శకుడు చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయాడట. కొన్ని సీన్లు అయితే మరీ బోరింగ్‌గా ఉన్నాయట. అసలు ఇది ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద తెరకెక్కించిన శ్రీనివాస్ అవసరాల సినిమానేనా అనే డౌట్ కూడా వస్తుందని పలువురు నెటీజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ శౌర్య – మాళవిక ల మధ్య కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. ఈ సినిమాకు ప్రాణం పోసింది మాత్రం సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ అంటున్నారు. తన సంగీతంతో పేలవమైన సీన్లు కూడా ఆహా..ఓహో అనేటట్లు చేశాడట. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా.. కథనంలో శ్రీనివాస్ అవసరాల పట్టుకోల్పోయాడని పలువురు తెలుపుతున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమా కు నెగిటివ్ టాక్ వినిపిస్తుంది.