రేపటి నుండి పీజీ ఈసెట్‌ పరీక్షలు

online exam
online exam

హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి నుండి ఇంజినీరింగ్‌, ఫార్మసీ, టెక్నాలజీ పీజీ కోర్సులో ప్రవేశాల కోసం28 నుండి 31వరకు తెలంగాణ పీజీ ఈసెట్‌ నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు విడతల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. హైదరాబాద్‌లో 12 పరీక్ష కేంద్రాలు, వరంగల్‌లో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పీజీ ఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎం.కుమార్‌ తెలిపారు. ఈ పరీక్షకు సుమారు 20,500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బయోమెట్రిక్‌ హాజరుతో లోపలకు అనుమతిస్తారన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/