మళ్లీ పెట్రోల్ వాత! ఈ నెలలో ఇది 9వసారి ధరల పెరుగుదల

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ రూ.96.21, డీజిల్‌ రూ.90.73

petrol prices Increased

New Delhi: దేశంలో ఆదివారం మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 30 పైసలు పెంచుతూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.58, డీజిల్‌ రూ.రూ.83.22కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.98.88, డీజిల్‌ రూ.90.04, చెన్నైలో పెట్రోల్‌ రూ.94.34, డీజిల్‌ రూ.88.07, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.92.67, డీజిల్‌ రూ.86.06, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.21, డీజిల్‌ రూ.90.73 గా ఉంది.

ఇప్పటి వరకు మే నెలలో తొమ్మిది సార్లు పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరిగాయి. తాజా పెరు‌గు‌ద‌లతో దేశ‌వ్యా‌ప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.103.52, డీజిల్‌ రూ.95.99కి చేరింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/