తగ్గుముఖం పట్టిన చమురు ధరలు

petrol diesel prices cut
petrol diesel prices cut

న్యూఢిల్లీ: వివిధ అంతర్జాతీయ పరిణామాలతో ఇటీవల పెరిగిన ఇంధన ధరలు మెల్లగా దిగివస్తున్నాయి. ఇరాన్‌ కమాండర్‌ సులేమానీపై అమెరికా దాడి ఫలితంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముడి చమురు ధరను విపరీతంగా పెంచేశాయి. కాగా, ప్రస్తుతం ఇరు దేశాల మద్ధ్య పరిస్థితి చల్లబడిన నేపథ్యంలో గత ఐదు రోజులుగా దేశీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా సోమవారం పెట్రోల్‌ ధర 10-12 పైసలు తగ్గగా, డీజిల్‌ ధరలో తగ్గుదల 19-20 పైసలుగా ఉంది. దేశంలోని వివిధ ముఖ్యపట్టణాలలో తాజాగా ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.74.98, ముంబయిలో రూ.80.58, కోల్‌కతాలో రూ. 77.58, చైన్నైలో రూ.77.89కు చేరింది. ఇక డీజిల్‌ విషయానికి వస్తే..లీటరు డీజిల్‌ ధర డిల్లీలో రూ.68.26, ముంబయిలో రూ.71.57, కోల్‌కతాలో రూ.70.62 ఉందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/