దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలు

petrol prices Increased
petrol-and-diesel-rates-increased

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లీట‌ర్ పెట్రోల్ పై 91 పైస‌లు, డీజిల్ పై 88 పైస‌లు పెంచారు. ఈ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు, డీజిల్ 87 పైసలు పెరిగింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.10కి, లీటర్ డీజిల్ ధర రూ. 95.49కి చేరుకుంది.

ఏపీలో లీటర్ పెట్రోల్ 88 పైసలు, డీజిల్ 83 పైసలు పెరిగింది. దీంలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.80కి, డీజిల్ ధర రూ. 96.83కి చేరుకుంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.21కి, డీజిల్ రూ. 97.26కి చేరింది. రానున్న రోజుల్లో కూడా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 96.21, డీజిల్ రూ. 87.47. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 110.78, డీజిల్ రూ. 94.94. కి పెరిగింది.

కాగా, గత ఐదు నెల‌ల త‌ర్వాత‌ ఈ రోజు పెట్రోల్, డీజీల్ పెరిగాయి. ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం వ‌ల్ల అంత‌ర్జాతీయంగా క్రూయిడ్ ఆయిల్ ధ‌ర‌లు భారీగా పెరిగాయ‌ని చ‌మురు సంస్థ‌లు తెలిపాయి. దీంతో భారీ స్థాయిలో న‌ష్ట పోతున్నాయని అందు కోసమే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/