రెండో రోజు తగ్గిన పెట్రోల్‌ ధర!

Reduced petrol prices
petrol prices

న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు భారత్‌లో వరుసగా రెండో రోజూ తగ్గాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 24 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. తాజా మార్పుతో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 84.75కు డీజిల్ ధర రూ. 79.08కి దిగివచ్చాయి. ఇదే సమయంలో అమరావతిలో పెట్రోలు ధర 17 పైసలు తగ్గగా, లీటరుకు రూ. 86.34కు, డీజిల్ ధర 23 పైసలు తగ్గగా, లీటరుకు రూ. 80.27కు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలుపై 17 పైసలు, డీజిల్ పై 22 పైసల మేరకు ధరలు తగ్గాయి. కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుదలను నమోదు చేయడంతో, ఒకటి, రెండు రోజుల్లోనే ఇండియాలోనూ ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.05 శాతం పెరిగి, బ్యారల్ కు 39.63 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 0.11 శాతం పెరిగి 37.30 డాలర్ల వద్ద కొనసాగింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/