ఇమ్రాన్‌ఖాన్‌పై పాక్‌ కోర్టు పిటిషన్‌

Imran-Khan
Imran-Khan

లాహోర్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ న్యాయవ్యవస్థను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై అనర్హత వేటు వేయాలని పాక్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన తాహిర్‌ ముఖ్సుద్‌ అనే పౌరుడు లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కాగా చికిత్స కోసం నవాజ్‌ షరీఫ్‌ను లండన్‌కు తరలించే వ్యవహారంలో ఆయన కోర్టును వివాదంలోకి లాగినందుకు గానూ ఆయనపై హై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తులపై ఆయన విమర్శలు చేశారని, అది పూర్తిగా కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే న్యాయవ్యవస్థను అవమానపరిచినందుకు గానూ 2013లోనూ ఇమ్రాన్‌కు కోర్టు ధిక్కార నోటీసులు పంపిన విషయాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/