పోలీసుల తీరుపై హైకోర్టు ఆశ్రయించిన రైతులు

Andhra Pradesh High Court
Andhra Pradesh High Court

అమరావతి: రాజధాని ప్రాంత రైతులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన రైతులు ఏపి హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ రాజధాని గ్రామాలకు చెందిన రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తాము శాంతియుతంగా దీక్ష చేస్తున్నా పోలీసులు పరస్పరం దాడులకు దిగుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. మరోవైపు మహిళలపై జరిగిన దాడులను విచారించేందుకు నిన్న రాజధాని గ్రామాల్లో జాతీయ మహిళా కమిషన్‌ బృందం పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో కూడా కొందరు అధికారులు వారికి సమయాన్ని కేటాయించకుండా చేశారని రైతులు వాదిస్తున్నారు. త్వరితగతిన విచారణ చేపట్టి తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రైతులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ కేసును నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/