న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా పీటర్‌ ఫుల్టన్‌

peter fulton
peter fulton

న్యూజిలాండ్‌ జట్టు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌గా ఆ దేశ మాజీ బ్యాట్స్‌మెన్‌ పీటర్‌ ఫుల్టన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌ జట్టుకు ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న మెక్‌ మిలాన్‌ ప్రపంచకప్‌ అనంతరం తన బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. ఆయన దాదాపు ఐదేళ్లు బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నారు. ప్రపంచకప్‌ అనంతరం మెక్‌ మిలాన్‌ బాధ్యతలను పీటర్‌ ఫుల్టన్‌ తీసుకోనున్నారు. జూలై 3న న్యూజిలాండ్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ జట్టుతో ఆడనుంది. కాని ప్రపంచకప్‌ తర్వాత ఫుల్టన్‌ బాధ్యతలు చేపట్టనున్నా అధికారికంగా మాత్రం జులై 1నే పదవిలోకి రానున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/