కుక్కకు పాకిన కరోనా వైరస్‌

హాంకాంగ్ లో తొలి కేసు నమోదు

pet-dog-corona virus
pet-dog-corona virus

హాంకాంగ్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) మనుషులపైనే కాదు జంతువులపై కూడా తన పంజాను విసురుతుంది. హాంకాంగ్ లో ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. మనిషి నుంచి జంతువుకు కరోనా వైరస్ సోకిన తొలి కేసుగా ఇది ప్రపంచ రికార్డుపుటల్లోకి ఎక్కింది. ఈ కుక్కను 60 ఏళ్ల మహిళ పెంచుకుంటోంది. ఆమె నుంచే కుక్కకు కరోనా సోకింది. దీంతో దాన్ని జంతువుల క్వారంటైన్ కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ ఉందని రిపోర్ట్ వస్తోంది. గత శుక్రవారం హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక క్వారంటైన్ ను ఏర్పాటు చేసింది. వైరస్ బారిన పడిన జంతువులను 14 రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/