పెరూ అధ్య‌క్షుడిగా స‌గ‌స్తి ప్ర‌మాణ‌స్వీకారం

Francisco Sagasti

లిమా: పెరూ తాత్కాలిక అధ్యక్షుడిగా ఫ్రాన్సిస్కో సగస్తీ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ అధ్యక్షుడు మార్టిన్ విజ్‌కర్రాపై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ దేశ కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి తొలగించింది. అతని స్థానంలో మాన్యువెల్ మెరినోను నియ‌మించింది. అయినా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌లు వెల్లువెత్తాయి. ఈ నిరసనల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో మాన్యువెల్ మెరినో కేవ‌లం ఐదు రోజుల్లోనే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో ఫ్రాన్సిస్కో స‌గ‌స్తీ పెరూ తాత్కాళిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మంగ‌ళ‌వారం అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఆయ‌న‌.. దేశ ప్రతినిధిగా ప్ర‌జ‌ల‌కు క‌లిగిన ఇబ్బందికి క్షమాపణ కోరుకుంటున్నానన్నారు.  పెరూవియన్ రాజకీయ నేత సగస్తీ ప్రమాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ప‌లువురు స్థానిక నాయ‌కులు హాజరయ్యారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/